జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం
సంభవించింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదంతో ఫ్యాక్టరీ వద్ద దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ఫ్యాక్టరీలో చెలరేగుతున్న మంటలను ఆదుపు చేస్తున్నారు.