ఫిరంగిపురం దగ్గర ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
గుంటూరు: ఫిరంగిపురం దగ్గర ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. డివైడర్ను ఢీకొట్టి ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో… పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రాజమండ్రి నుంచి శబరిమల వెళుతోంది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు.