బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్

 

రెండు నెలల క్రితం కాజీపేట మండలం కడిపికొండకు చెందిన 9మంది విహార యాత్రకు వెళ్లి బోటు ప్రమాదంలో మరణించిన సంఘటన తనను దిగ్బ్రాంతికి గురిచేసిందని వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో హుటా హుటిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నేను సంఘటన స్థలానికి చేరుకున్నామని, క్షతగాత్రులకు మోరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కోన్నారు. వారం రోజుల పాటు ఆరోగ్యం సహకరించకున్నా అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాలుపంచుకున్నట్లు ఎమ్మెల్యే అరూరి వెల్లించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, కాజీపేట ఎమ్మార్వో నాగేశ్వర్ రావుతో పాటు ఇతర అధికార యాత్రాంగం కూడా తీవ్రంగా శ్రమించారని అభినందించారు. బోటు ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని పేర్కోన్నారు. వీటితో పాటు పార్టీ సభ్యత్వం ఉన్న వారికి మరో రెండు లక్షల పార్టీ ఇన్సురెన్స్ చెక్కులను సైతం త్వరలోనే అందించనున్నట్లు ఎమ్మెల్యే అరూరి తెలిపారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అరూరి రమేష్ మీకు అండగా ఉంటాడని వారికి హామీ ఇచ్చారు. బోటు ప్రమాదంలో మరణించిన 9 మంది కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 10 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం 5 లక్షలు మొత్తం ఒక్కో కుటుంబానికి 15 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అరూరి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ అందజేశారు. మరో 5 కుటుంబాలకు 6 లక్షల లెబర్ ఇన్సూరెన్స్ చెక్కులను సైతం బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకా రెడ్డి, ఎమ్మార్వో నాగేశ్వర్ రావు, కార్పోరేటర్ బస్కె శ్రీలేఖ, కూడా అడ్వైజరీ కమిటీ మెంబర్ వనం రెడ్డి, అధికారులు, స్థానిక డివిజన్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.

Banner Ad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *