All set for Numaish 2020

జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ముఖ్యఅతిథులుగా పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు ఈటెల రాజేందర్.

Banner Ad

ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి బెంగాళ్ వరకు వేలాది మంది వ్యాపారస్తులు హైదరాబాద్లో జరిగే నుమాయిష్ కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఉత్పత్తులను ఇక్కడ మార్కెట్ చేసుకోవడానికి మంచి వేదికగా భావిస్తున్నారు.

ఎక్సిబిషన్ సొసైటీ వ్యక్తికి సంబంధించి కాదు దీని ద్వారా వచ్చిన డబ్బులను 18 విద్యా సంస్థల్లో చదువుతున్న 30 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం వినియోగిస్తున్నారు.

షాపుల వారిని కూడా కుటుంబ సభ్యులుగా భావించి వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాము. గతంలో జరిగిన సంఘటనను గుణపాటం గా చేసుకొని డబ్బుల కంటే ప్రాణాలకు వారి ఆస్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ.. భద్రత ఏర్పాట్లు చేశామని ఈటెల రాజేందర్ అన్నారు.

ఫైర్ సేఫ్టీ కోసం మూడున్నర కోట్ల తో శాశ్వత ప్రాతిపదికన సంపులు, పైప్ లైన్లు ఏర్పాటు చేశాము. ఈసారి షాప్స్ సంఖ్య 25 శాతం తగ్గించి భద్రతకు పెద్దపీట వేశామని తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు నుమాయిశ్ స్థాయిని పెంచాలని కోరుతున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. దేశమంతా జనవరిలో హైదరాబాద్ రావాలి అని లక్ష్యంతో పని చేస్తున్నాము.
ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్కు 20 లక్షల మంది సందర్శకులు వస్తుంటారు.
ఈసారి 1500 స్టాళ్లు ఏర్పాటు చేశాము. విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
మెట్రో రైలు రాత్రి 11:30 పాటు నడపడానికి అంగీకరించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనే టికెట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు.
50 సిసి కెమెరాలతో కమోండ్ కంట్రోల్ ఏర్పాటు చేశాము. ఎక్కడా ఎం జరిగిన తెలుసుకోవడానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశాం.

మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ…
ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎగ్జిబిషన్ లేదు.
ఇది హైదరాబాద్ నగరానికి తలమానికం
ప్రాముఖ్యత పెంచేందుకు GHMC తరఫున పూర్తి స్థాయి లో సహకారం అందిస్తాము.
మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే మంచిదని సూచిస్తున్నా.


తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్ధక శాఖ మంత్రి మాట్లాడుతూ…
80 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేయాలంటే అంటే వీరంతా ఎంత కమిట్మెంట్తో పని చేస్తున్నారో అర్థమవుతుంది.
దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తుంది.
నాణ్యమైన విద్యను 30 వేల మంది స్టూడెంట్స్ కి అందిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీకి హ్యాట్సాఫ్. దేశంలో ఎక్కడా కూడా ఒక ప్రైవేట్ సంస్థ ఇంత పెద్దఎత్తున విద్యను అందించడం లేదు.

షాపుల వారికి కూడా అవగాహన కల్పించి ప్రమాద సంఘటన జరిగినప్పుడు వెంటనే బయట పడేలా చర్యలు తీసుకోవాలి.

ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన హోం మంత్రి మహ్మద్ అలీ మాట్లాడుతూ….

ఈ సంవత్సరం చాలా మార్పులు చేర్పులు చేశారు.
భద్రత పరంగా అన్ని అన్ని చర్యలు తీసుకున్నారు.
అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ఎంత చొరవ తీసుకున్నారో నాకు తెలుసు, ఆయనకు ప్రత్యేక అభినందనలు.

పోలీస్ శాఖ తరపున ఎగ్జిబీషన్ వారికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యవంతమైన ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అని మహమూద్ అలి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *