ఏ పీ లో పెరిగిన కరోనా కేసులు / Andhra Pradesh Corona cases
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్యా పెరుగుతుంది. తాజాగా ఆరో రెండు కేసులు నమోదు అయ్యాయి. రాజమహేంద్రవరం నుండి, కాకినాడ నుండి ఒక్కో కేసు నమోదు అయినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రం లో కరోనా బాధితుల సంఖ్య 23 కు చేరింది.
ఇపటివరుకు 649 మంది నుండి నమూనాలు సేకరించగా అందులో 23 పాజిటివ్, 526 నెగిటివ్ గా నిర్ధారణ అయినట్లు గా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 100 మంది అనుమానితుల నమూనాల ఫలితాల కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొంది. అదే విధంగా ఇప్పటివరకు విదేశాల నుండి 26,672 మంది ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాల వారీగా నమోదైన కేసులు
విశాఖ 6
కృష్ణ 4
గుంటూరు 4
ప్రకాశం 3
చిత్తూరు 1
కర్నూలు 1
నెల్లూరు 1 చొప్పున బాధితులు చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు