ఆర్టీసీపై కేసీఆర్‌ కీలక సమీక్ష

హైదరాబాద్‌:ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌, సీఎస్‌ ఎస్కే జోషి, ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ, రవాణాశాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. షరతుల్లేకుండా కార్మికులను విధుల్లోకి ఆహ్వానిస్తే వచ్చి చేరతామని ఆర్టీసీ ఐకాస ప్రకటించిన నేపథ్యంలో ఈ సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏయే అంశాలు ఉన్నాయి? హైకోర్టు ఎలాంటి ఆదేశాలిచ్చిందనే అంశంతో పాటు ఐకాస ప్రతిపాదనలపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. గతంలో కార్మికులు విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి రెండుసార్లు విజ్ఞప్తి చేశారు. అయినా కార్మికులు సమ్మె విరమించలేదు.

Banner Ad

అయితే, ఐకాసనే స్వతహాగా ముందుకొచ్చి విధుల్లో చేరుతామని, షరతుల్లేకుండా కార్మికులను చేర్చుకోవాలంటూ కోరిన నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో సీఎం పూర్తిస్థాయిలో చర్చించే అవకాశముంది.

సమ్మె, కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంలో కేసీఆర్‌ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *