Eatala Rajender launches Ayurveda Raksha kit for corona warriors
The state Ayush wing on Saturday launched Ayurveda Raksha Kit. Health minister Eatala Rajender formally released the first batch of kit by distributing them to Hyderabad Central Joint CP, P. Vishwanath Prasad and IGP (Home Guards) B. Bala NagaDevi.
The Ayurveda Kit contains five different Ayurveda-based medicine that promises to enhance body immunity. In the first phase, the Ayush authorities are planning to distribute close to 20k such kits among police personnel and health care workers in Telangana.

ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్ రక్ష కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. రెడ్ జోన్ లో పని చేస్తున్న పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి ఆయుష్ రక్ష కిట్స్ ను అందజేయనున్నారు. 20 వేల కిట్స్ ను మొదటి దఫా పంపిణీ చేయనున్నారు. ఈ రోజు BRKR భవన్ లోని మంత్రి కార్యాలయంలో ఆయుష్ రక్ష కిట్స్ ని పోలీస్ అధికారులకు అందించారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ జాయింట్ CP విశ్వప్రసాద్, IPS, బాలనాగాదేవి IPS, ఐజిపి హోమ్ గార్డ్స్, ఏసిపి సైఫాబాద్ వేణుగోపాల్ రెడ్డి లకు మంత్రి ఈటల రాజేందర్ గారు కిట్స్ అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయుర్వేద అతి ప్రాచీనమైన వైద్య శాస్త్రం. కరోనాను ఎదుర్కొనేందుకు ఆయుష్ కమీషనర్ అలుగు వర్షిణి ఆధ్వర్యంలో ఆ డిపార్ట్మెంట్ ఐదు రకాల మందులతో ఈ కిట్ తయారు చేశారు వారికి అభినందనలు. ప్రపంచానికి ఇలాంటి వైద్యాన్ని అందించిన దేశం భారత దేశం అని మంత్రి అన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత దేశం కరోనా వ్యాప్తి నీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. తెలంగాణలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాప్తి, మరణాల రేట్ చాలా తక్కువ ఉంది అన్నారు.