George Reddy Movie Review

 

రివ్యూ : జార్జ్‌రెడ్డి. ప్రతి తెలుగువాడు తెలుసుకోవాల్సిన చరిత్ర

Banner Ad

టైటిల్‌: జార్జ్‌రెడ్డి
జానర్‌: బయోపిక్‌
నటీనటులు: సందీప్‌ మాధవ్‌, సత్య దేవ్, మనోజ్‌ నందన్, చైతన్య కృష్ణ, వినయ్‌ వర్మ, అభయ్‌, ముస్కాన్, మహాతి
సంగీతం: సురేష్‌ బొబ్బిలి
నిర్మాత: అప్పిరెడ్డి
దర్శకత్వం: జీవన్‌ రెడ్డి
రిలీజ్ డేట్‌: 22 నవంబర్‌, 2019
ప్రస్తుతం టాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవలే చరిత్రలో అందరూ మర్చిపోయిన సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమా వచ్చింది. ఇక ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 25 ఏళ్లకే స్టూడెంట్ లీడర్‌గా ఎన్నో సంచలనాలకు నెలవు అయిన జార్జ్‌రెడ్డి జీవితం ఆధారంగా జార్జ్‌రెడ్డి సినిమా తెరకెక్కింది.
రిలీజ్‌కు ముందే ట్రైలర్లు, మెగా ఫ్యామిలీ మద్దతు, ఏబీవీపీ ఆందోళనలతో పాటు నైజాంలో కాస్త ప్రి రిలీజ్ బజ్ ఉండడంతో జార్జ్‌రెడ్డిపై ఆసక్తి నెలకొంది. పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఈ సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడడంతో ఈ తరం జనరేషన్‌కు జార్జ్‌రెడ్డి గురించి తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువుగా ఉంది. ఈ అంచనాల నేపథ్యంలో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ? రివ్యూలో చూద్దాం.
కథ :
జార్జిరెడ్డి పుట్టుక కేరళ.. చదివింది బెంగళూరు, చెన్నైలలో.. విద్యార్థి నాయకుడిగా ఎదిగింది హైదరాబాద్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో. జార్జి రెడ్డి (సందీప్‌ మాధవ్‌) చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో ముందుండేవాడు. అటు విజ్ఞానంతో పాటు ఇటు కత్తిసాము, కర్రసాము, బాక్సింగ్‌లో కూడా అతడికి మంచి టాలెంట్ ఉంటుంది. తల్లి (దేవిక) తోడ్పాటు ఉంటుంది. ఎప్పుడైతే యూనివర్సిటీలో అడుగు పెట్టాడో అప్పటి నుంచి అతడి లైఫ్ మారిపోతుంది. అతడి టాలెంట్‌కు ఎంతో మంది మేథావులు సైతం షాక్ అవ్వడంతో పాటు అతడిని తమ యూనివర్సిటీకి రావాలని ఆహ్వానాలు పంపినా అతడు మాత్రం తిరస్కరిస్తాడు.
ఈ క్రమంలోనే యూనివర్సిటీపై పట్టు బిగించే క్రమంలో ఏబీసీడీ గ్రూప్ (సత్య), కౌశిక్ (కృష్ణ చైతన్య), అర్జున్ (మనోజ్ నందన్‌) లాంటి వాళ్లు యూనివర్సిటీలో గ్రూపు రాజకీయాలు చేస్తుంటారు. వీళ్ల అరాచకాలు రోజు రోజుకు ఎక్కువ అవుతుంటాయి. ముందు సైలెంట్‌గా ఉన్నా తర్వాత జార్జ్‌రెడ్డి వీళ్లను ఎదిరించడం స్టార్ట్ చేస్తాడు. చేగువేరా ప్రభావంతో పోరాట పటిమ కనపరిచి చివరకు స్టూడెంట్ లీడర్‌గా మారతాడు. ఇలా యూనివర్సిటీ ఎలక్షన్స్‌లో జార్జ్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడు. రోజు రోజుకు అతడు పాపులర్ అవ్వడంతో అతడిని చంపితే తప్ప మనకు చోటు ఉండదని ప్రత్యర్థులు స్కెచ్ వేస్తారు ? అప్పుడు జార్జ్‌రెడ్డి ఏం చేస్తాడు ? అతడు ఎవరిని ప్రేమించాడు ? అతడి ప్రేమ ఏమైంది ? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *