“గిఫ్ట్ ఏ స్మైల్”కు మరో 21 అంబులెన్సులు (Gift a smile challenge)
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వచ్చిన మరో 21 అంబులెన్సులను శనివారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు జెండా ఊపి ప్రారంభించారు. తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీఆర్.. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ప్రజల అత్యవసర సేవల కోసం అంబులెన్సులను ఇవ్వాలని నిర్ణయించారు. ఆయన స్ఫూర్తితో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మూడు అంబులెన్సుల చొప్పున ఇచ్చారు. నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి రెండు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఉపేందర్‌రెడ్డి, ఆరూరి రమేశ్, వినయ్‌భాస్కర్, వరంగల్‌కు చెందిన లక్ష్మణ్‌రావు ఒక్కో అంబులెన్స్‌ను అందించారు. అంబులెన్సులను అందించిన నాయకులను మంత్రి కేటీఆర్ అభినందించారు.

Read more:




