RTC Strike – updates

29-11-2019

  • TSRTC workers resume work, Telangana CM to hold meet  with staff on December 1
  • TSRTC workers end strike as Telangana CM asks them to rejoin
  • The strike began on October 5th
  • After 55 days of Strike TSRTC workers resumed work on Friday 
  • The state government announced financial assistance and job to the families those who lost their lives during the strike period

26-11-2019


దిల్సుఖ్నగర్ సిటీ డిపో హైదరాబాద్ టు డిపోల్లో విధుల్లో చేరేందుకు వచ్చిన 80 మంది కార్మికుల అరెస్టు వారిలో 30 మంది మహిళా కార్మికులు

Banner Ad

50 RTC employees arrested at falaknuma bus depo,45 at farooqnagar bus depo u0026amp; 164(124 Male u0026amp; 36 female employees)at Midhani bus depo


సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్ లో నురగలు కక్కుకుని కిందపడిపోయిన ఆర్టీసీ కార్మికుడు భీమ్లా. సంగారెడ్డి డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న భీమ్లా. ఉదయం విధులలో చేరేందుకు సంగారెడ్డి డిపోకు వచ్చిన భీమ్లా , అరెస్టు చేసిన పోలీసులు. భీమ్లాను ఆసుపత్రికి తరలించిన కార్మికులు. ఉద్యోగం పోతుందన్న ఆందోళనతో భీమ్లాకు గుండెపోటు వచ్చిందంటున్న తోటి కార్మికులు.


25-11-2019


TSRTC MD’s Press Release

The announcement of RTC JAC that they will be joining duties from tomorrow is ridiculous. On one hand they say they will continue the strike and on the other, say they will join duties. read more… Nowhere in any


ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ – పత్రికా ప్రకటన

రేపటి నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జెఎసి చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే, మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని చెబుతున్నారు. read more… తమ ఇష్టమొచ్చినప్పుడు 


21-11-2019

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్.టి.సి.) విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి?

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్.టి.సి.) విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశంపై ప్రభుత్వం విస్తృత చర్చ జరిపింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకశంగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్య అందించడమే ప్రథమ కర్తవ్యంగా, ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తున్నది. read more …ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన


ఆర్టీసీపై కేసీఆర్‌ కీలక సమీక్ష

హైదరాబాద్‌:ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌, సీఎస్‌ ఎస్కే జోషి, ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ, రవాణాశాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. షరతుల్లేకుండా కార్మికులను విధుల్లోకి ఆహ్వానిస్తే వచ్చి చేరతామని ఆర్టీసీ ఐకాస ప్రకటించిన నేపథ్యంలో ఈ సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏయే అంశాలు ఉన్నాయి? హైకోర్టు ఎలాంటి ఆదేశాలిచ్చిందనే అంశంతో పాటు ఐకాస ప్రతిపాదనలపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. గతంలో కార్మికులు విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి రెండుసార్లు విజ్ఞప్తి చేశారు. అయినా కార్మికులు సమ్మె విరమించలేదు.

అయితే, ఐకాసనే స్వతహాగా ముందుకొచ్చి విధుల్లో చేరుతామని, షరతుల్లేకుండా కార్మికులను చేర్చుకోవాలంటూ కోరిన నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో సీఎం పూర్తిస్థాయిలో చర్చించే అవకాశముంది.

సమ్మె, కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంలో కేసీఆర్‌ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఆర్టీసీ జేఏసీ -1కన్వీనర్ హనుమంత్ ముదిరాజ్

ఆర్టీసీలో పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలే ఎక్కువ సంఖ్యలో వున్నారు. 48రోజుల సమ్మె, 29 మంది బలిదానాలు గాలికి వదిలేసి ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమిస్తాం అని చెప్పడం బాధ కరం.. ఆర్టీసీ కార్మికుల త్యాగాలకు న్యాయం కలిగేలా పోరాడుతాం. గతంలో ఐఆర్ 16శాతం తీసుకున్నపుడు.. జేఏసీ నాయకులు మంత్రుల చుట్టు తిరిగి విజయం సాధించారు. మరి ఇప్పుడు డిమాండ్ లు పరిష్కరించడంలో ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదు. జేఏసీ నాయకుల కారణంగానే. ఆర్టీసీ సమ్మె ఆగం అయ్యింది. సీఎం ను జేఏసీ -1 నాయకులు కలిసి ఆర్టీసీ లో సమస్యలు వివరిస్తాం. కొందరు ఆర్టీసీ నాయకుల తీరు కారణంగా సీఎం సీరియస్ గా వున్నారు. అశ్వత్దామా రెడ్డి వల్లనే ఆర్టీసీలో సమస్యలు పెరిగాయి. సీఎం ను వేడుకోని ఆర్టీసీ సమస్యలను పరిష్కరించేలా ప్రయత్నం చేద్దాం. మీకు నచ్చని వారిని కాకుండా నచ్చే వారిని పిలిచి చర్చించండి. ప్రధాన డిమాండ్స్ పక్కన పెట్టినప్పుడే జేఏసీ ఓటమి పాలైంది

TJMU ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్

ఇప్పటి వరకు 29 మంది ఆర్టీసీ కార్మికులు మరణించారు. మరణించిన కుటుంబాలను అదుకోకుండా , ఎన్నో డిపోల పరిధిలో కార్మికులపై కేసులు కూడా నమోదు చేశారు వాటి పై ఎం మాట్లాడకుండా జేఏసీ సమ్మె విరమిస్తున్నామని వాళ్ళని మోసం చేసింది. ఇలా విరమించాల్సి వస్తే ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడే విరమించేది. కార్మికులను బలి పశువులను చేస్తూ జేఏసీ సమ్మె విరమించేలా ప్రకటన చేసింది. వాళ్ళు సమ్మె విరమించిన జేఏసీ 1 సమ్మె కొనసాగిస్తోంది. ఆర్టీసీ లో ఉన్న వాళ్ళు అందరూ పేద వాళ్ళు ఆర్టీసీని నిర్విర్యం చేయకుండా సంస్థను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీ జేఏసీ మూడు సంఘలను కలుపుకొని మాత్రమే ముందుకు వెళ్తుంది. ఆర్టీసీలో సమస్యలు పెరిగిపోవడానికి కారణం అశ్వద్ధామరెడ్డి అసమర్థత వళ్లే. సీఎం కేసీఆర్ మమ్మల్ని పిలిచి మా సమస్యలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం.


18-11-2019

 

TSRTC ని ప్రైవేట్ పరం చేయనని చెప్పిన విషయం

 

29,నవంబర్,2014 న తెలంగాణ ముఖ్యమంత్రి KCR ఎట్టిపరిస్థితుల్లోనూ TSRTC ని ప్రైవేట్ పరం చేయనని చెప్పిన విషయం ఈనాడు పేపర్,30,నవంబర్,2014 న ప్రచురించిన పేపర్ కట్టింగ్.


17-11-2019


ఆస్వాదమా రెడ్డి అరెస్టు అక్రమం : లక్ష్మణ్, బీజేపీ అధ్యక్షుడు

ఆర్టీసీ సమ్మె 44 రాజులు కావస్తోంది

సీఎం , మంత్రుల వాక్యాల కు మనస్తాపంతో 24 మంది చనిపోయారు..

తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారికి అండగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల ఇప్పుడు ఎక్కడ పోయారు..

హైకోర్టు మొట్టికాయలు వేస్తున్న ప్రభుత్వనికి చీమకుట్టినట్లు లేదు

ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ వేసిన అఫిడవిట్ చూస్తుటే ఆయన ఐఏఎస్ అధికార లేక టి.ఆర్.ఎస్ ప్రధాన కార్యదర్శిన అర్థం కావడం లేదు…

ఒక ఐఏఎస్ అధికారి ఇంతలా దిగజారడం ఎక్కడ చూడలేదు..

ఈ ప్రభుత్వని కూల్చేదుకు ఆర్టీసీ నాయకులు రాజకీయ పార్టీలతో చేతులు కలిపారు అని అనడం అస్యస్పదం..

సునీల్ శర్మ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతూన్నారు

హై కోర్టు దీనిని సుమోటోగా తీసుకొని విచారణ జరపాలి..

బిజెపిపై చేసిన ఆరోపణలను సునీల్ శర్మ నిరూపించాలి..

లేకపోతే ఆయన పదవికి రాజీనామా చేయాలి.. లేకపోతే మేము డివోపిటికి పిర్యాదు చేస్తాం

కేంద్ర అధికారం లో ఉన్న బిజెపి పై నింద వేసేముందు కనీసం ఆలోచన చేయాలి

సునీల్ శర్మ చేసిన అఫిడవిట్ చూస్తుంటే టి.ఆర్.ఎస్ సూసైడ్ చేసుకున్నట్లే అనిపిస్తుంది..

ఆర్టీసీ కార్మికులకు ఎమ్మార్పీఎస్ మహా దీక్ష చేపడితే దానిని పోలీసులు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు: : లక్ష్మణ్, బీజేపీ అధ్యక్షుడు


కొనసాగుతున్న సమ్మె

మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె వరుసగా 44వ రోజు కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని జీడిమెట్ల డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు బస్సులను అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. కార్మికులను అరెస్టు చేసి జీడిమెట్ల ఠాణాకు తరలించారు. జగిత్యాల డిపో ఎదుట కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. బస్సులను అడ్డుకున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట బైఠాయించారు. బస్సులను బయటకు తీయవద్దంటూ నినాదాలు చేశారు. ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లోనూ అందోళనలు కొనసాగుతున్నాయి.


దీక్ష విరమించేది లేదు: అశ్వత్థామరెడ్డి

తెలంగాణ ఆర్టీసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్షను వరుసగా రెండో రోజూ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నిన్నటి నుంచి ఆయన స్వీయ గృహనిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే.

ఇవాళ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఆర్టీసీ కార్మికులపట్ల కేసీఆర్‌ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

దీక్ష విరమింపజేసేందుకు పోలీసులు ఆయనతో చర్చలు జరుపుతున్నారు.


ఇందిరాపార్క్ వద్ద ఎం ఆర్ పీఎస్ మహాదీక్షకు పోలీసుల అనుమతి లేక పోవడంతో ఇందిరా పార్కు ధర్నా చౌక్ ను సందర్శించి పోలీసు బందోబస్తును పర్యవేక్షిస్తున్న నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్


మంద కృష్ణ మాదిగ అరెస్టు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకుకు మద్దతుగా ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అధ్వర్యంలో ఆదివారం ఇందిరా పార్క్ వద్ద సబ్బండ కులాల మహాదీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

దీంతో ఇందిరా పార్క్‌కు వస్తున్న నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంద కృష్ణ హబ్సిగూడలోని కృష్ణ లాడ్జ్‌లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు లాడ్జ్‌కి చేరుకుని మంద కృష్ణను అరెస్ట్ చేసి నాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్బంగా మంద కృష్ణ మాట్లాడుతూ ఆర్టీసీలో ఉన్న కార్మికులు పేదవారు ఉన్నారని, వారు చేస్తున్న సమ్మె న్యాయమైనదని అన్నారు. సబ్బండ వర్గాల మద్దతు ఆర్టీసీ వర్గాలకు ఉండాలని దీక్షకు సిద్దపడ్డామని అన్నారు. కానీ ప్రభుత్వం దీక్షకు అనుమతి ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందన్నారు. ఎట్టి పరిస్థిలోనైనా భవిష్యత్తులో దీక్షను చేసి తీరుతామని మంద కృష్ణ తెలిపారు.


టిఎస్‌ఆర్‌టిసి కార్మికులకు మద్దతుగా మాదిగా రిజర్వేషన్ పోరతా సమితి కార్యకర్తలు ఇందిరా పార్క్‌లో చేపట్టిన ‘మహా దీక్ష’ ముందు, పోలీసులు మందా కృష్ణ మాదిగాను అదుపులోకి తీసుకున్నారు.

నిరసనకు అనుమతి నిరాకరించబడింది మరియు నగరంలో ఆంక్షలు విధించబడ్డాయి. హైదరాబాద్ సీపీ.


ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఈరోజు ఎమ్మార్పీఎస్ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహా దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు….

ట్యాంక్ బండ్ ఇందిరాపార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ను పూర్తిగా దారి మళ్లించిన పోలీసులు….

ఇందిరా పార్కు చుట్టూ ఆంక్షలు …. 8am to 6pm

మరికొద్ది సేపట్లో ఇందిరాపార్క్ ఎమ్మార్పీఎస్ నాయకులు రానున్న నేపథ్యంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగిన పోలీసులు….

ఎక్కడికక్కడ కొనసాగుతున్న అరెస్టులు…

ఎమ్మార్పీఎస్ చేపట్టిన మహా దీక్ష లో అసాంఘిక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేశారని పోలీసులకు పోలీస్ సమాచారం రావడంతో అప్రమత్తమైన పోలీసులు బలగాలు