కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీ సంచలన కామెంట్స్
మునిసిపల్ ఎన్నికలో ఓడిపోతే మంత్రులను తొలగిస్తానని సీఎం కేసీఆర్ హెచ్చరిస్తున్నారు. సీఎం కేసీఆర్ మంత్రులను బంట్రోతులుగా చూస్తున్నారు. కేసీఆర్ ని బిడ్డ నిజామాబాద్ ఎంపీ గా ఓడిపోయింది మరి నువ్వు బాధ్యత ఎందుకు వహించలేదు. ఎందుకు టి ఆర్ ఎస్ అధ్యక్ష పదవికి,ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. మంత్రులను బెదిరించే అధికారం ఎవరు ఇచ్చారు నీకు కేసీఆర్. కేసీఆర్ నీచంగా ప్రవర్తిస్తున్నారు. మంత్రలను బెదిరిస్తే దోచుకున్న డబ్బులు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి గెలిపిస్తారని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారు. మునిసిపాలిటీలకు 6 సంవత్సరాలుగా టి ఆర్ ఎస్ 6 పైసలు కూడా ఇవ్వలేదు. మునిసిపాలిటీలకు కేంద్రం నుండి వచ్చే నిధులను కూడా కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లించింది. మునిసిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ 6 సంవత్సరాలో మునిసిపాలిటీలకు ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలి. మునిసిపల్ ఎన్నికలో ప్రశ్నించే గొంతుకలను గెలిపించండి. మెజార్టీ మునిసిపల్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ప్రజలు,కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఆదర్యపడవద్దు రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.