కేటీఆర్ చేసిన రాజకీయ ప్రకటన రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో లబ్ది పొందదానికేనని టిఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు.
గురువారం నాడు ఆయన ఒక ప్రకటన చేస్తూ కేటిఆర్ కేవలం రాజకీయ లబ్దికోసమే మాట్లాడారని టిఆర్ఎస్ పట్ల వ్యతిరేకత తో మున్సిపాలిటీ లలో ఓటమి తప్పదని భయంతో ప్రజలను ప్రభావితం చేయడానికి ఈ రకంగా మాట్లాడారని అన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెసుకు మంచి రోజులు ఉన్నాయని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతున్న తరుణంలో కేటీఆర్ ఇలా మాట్లాడారని అన్నారు.
టిఆర్ఎస్ కు గెలుపు ధీమా ఉంటే ఎన్నికలను పారదర్శకంగా ఇర్వహించే వారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు.