TRS wins MLC by-election

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన శ్రీమతి కల్వకుంట్ల కవిత.. 88 శాతం ఓట్లు సాధించి రికార్డు విజయం
మొత్తం 823 ఓట్లకు గాను, 728 ఓట్లు పొందిన టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి కల్వకుంట్ల కవిత
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. మొత్తం 824 ఓట్లకు గాను, 823 ఓట్లు పోలవ్వగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత, 728 ఓట్లు సాధించి చరిత్ర సృష్టించారు. పోతాంకర్ లక్ష్మీనారాయణ (బీజేపీ)- 56, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి( కాంగ్రెస్)-29 ఓట్లు.
10 ఓట్లను చెల్లనవిగా ప్రకటించారు ఎన్నికల సంఘం అధికారులు. మొత్తం రెండు రౌండ్లలో కౌంటింగ్ జరగ్గా..రెండు రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పూర్తి ఆధిక్యం సాధించారు. మొదటి రౌండ్ లోనే గెలుపునకు కావలసిన మెజారిటీ సాధించి, విజయ ఢంకా మోగించారు.